హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించిన 211 వాహనాలను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో రవాణా శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిట్‌నెస్ లేకపోవడం, పన్ను ఎగవేత, ఓవర్ లోడ్ వంటి కారణాలతో ఈ వాహనాలను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా 12 మొబైల్ స్క్వాడ్‌లతో పాటు, ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక ప్రత్యేక స్క్వాడ్ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తోందని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
