మంత్రి వివేక్ చొరవతో 213 మంది సింగరేణి సెక్యూరిటీ గార్డులకు తిరిగి ఉద్యోగాలు

మంత్రి వివేక్ చొరవతో 213 మంది సింగరేణి సెక్యూరిటీ గార్డులకు తిరిగి ఉద్యోగాలు
  •     హర్షం వ్యక్తం చేసిన కార్మికులు.. వివేక్​ ఫొటోకు క్షీరాభిషేకం

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి చొరవతోనే తమకు తిరిగి ఉద్యోగాలు దక్కాయని, ఆయనకు రుణపడి ఉంటామని సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్​క్లబ్​ఆవరణలో మంత్రి వివేక్​ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మందమర్రి సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న 213 మంది కాంట్రాక్ట్​ సెక్యూరిటీ గార్డుల టెండర్​కాలపరిమితి ముగిసిందని,  యాజమాన్యం రెండు నెలల క్రితం తమను తొలగించిందన్నారు. 

ఉపాధి లేకపోవడంతో కొత్త టెండర్​ పిలిచి తమకు ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మొరపెట్టుకున్నామన్నారు. ఈమేరకు కార్మిక మంత్రి వివేక్​ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి,  సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్​జ్యోతితో మాట్లాడారన్నారు. 213 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను తిరిగి ఉద్యోగాలకు తీసుకునేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పించారని ఆనందం వ్యక్తంచేశారు.