
రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మండలం తిమ్మాపూర్ దగ్గర గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 70 లక్షల విలువైన 214 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 2 లక్షల పదివేల నగదు, 3 కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎస్ ఓటీ, కొత్తూరు పోలీసులజాయింట్ ఆపరేషన్ లో భాగంగా భారీగా గంజాయి పట్టుబడింది. ఇద్దరు కీలక సూత్రధారులు పరారీలో ఉన్నట్లు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.