
సికింద్రాబాద్/హైదరాబాద్, వెలుగు: అయోధ్య, -కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు 360 మంది యాత్రికులు మంగళవారం 21వ భారత్గౌరవ్రైలులో బయలుదేరి వెళ్లారు. సికింద్రాబాద్స్టేషన్లో సీనియర్సిటిజన్ సిటిజన్ హన్మంతు రైలును ప్రారంభించారు. 9 రోజుల తర్వాత ఈ రైలు తిరిగి సికింద్రాబాద్కు చేరుకుంటుంది. యాత్రికులు గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని వస్తారు. ఈ రైలు కాజీపేట(వరంగల్), ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, వైజాగ్, విజయనగరం, ఒడిశాలోని టిట్లాగఢ్స్టేషన్లలో ఆగుతుంది.