ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ హైదరాబాద్‌ యువతికి 22 చలాన్లు

ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ హైదరాబాద్‌ యువతికి 22 చలాన్లు

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ను కఠినంతరం చేశారు.రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించడంతో పాటు...వాహనాన్ని సీజ్ కూడా చేస్తున్నారు. అయినా కొందరు ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు విధించే చలానాలను కూడా పట్టించుకోవడం లేదు. ఇదే తరహాలో ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసి..22 సార్లు చలాన్లు పడినా ఓ యువతి లెక్కచేయకుండా రోడ్లపై తిరుగుతోంది. చివరకు ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది.

హైదరాబాద్ నిజాంపేటకు చెందిన ఓ యువతిపై సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడంపై ఇప్పటి వరకు 22 సార్లు జరిమానాలు విధించారు. ఎప్పుడు జరిమానా విధించినా చెల్లించకుండా ద్విచక్రవాహనంపై తిరుగుతోంది. ఈ క్రమంలో మరోసారి ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి కూకట్‌పల్లి పోలీసులకు దొరికిపోయింది. దీంతో ఆ యువతికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చలాన్ల రూపంలో విధించిన రూ.9,070 కట్టించుకొని పంపించారు.