కోచింగ్ లేకుండా ఐపీఎస్ పాసైన 22 ఏళ్ల కుర్రాడు

కోచింగ్ లేకుండా ఐపీఎస్ పాసైన 22 ఏళ్ల కుర్రాడు

ఉత్తరప్రదేశ్: గ్రూప్స్ పరీక్షలలో అర్హత సాధించాలంటే ఎంతో కఠోరశ్రమ అవసరం. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి పగలు, రాత్రీ తేడా లేకుండా యువత 24 గంటలు పుస్తకాలతోనే కుస్తీ పడతారు. అయినా ఒక్కోసారి ఫలితం వ్యతిరేకంగా వస్తుంది. పట్టువదలని విక్రమార్కుడిలా.. ఒకసారి కాకపోతే మరోసారి అన్నట్లు గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతారు. అయితే ఉత్తరప్రదేశ్‎కి చెందిన 22 ఏళ్ల కుర్రాడు మాత్రం ఫస్ట్ అటెంప్ట్‎లోనే యూపీఎస్సీ పరీక్షను క్లియర్ చేశాడు. 

యూపీలోని బారాబంకి జిల్లాకు చెందిన రాధాకాంత్, గీతా శుక్లాలు దంపతులు. వీరు పిల్లల చదువు కోసం 20 సంవత్సరాల క్రితం సొంతూరు మద్నా నుంచి బారాబంకికి మకాం మార్చారు. రాధాకాంత్ ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. రాధాకాంత్ దంపతులకు ఆదర్శ్ కాంత్ శుక్లా మరియు స్నేహ ఇద్దరు పిల్లలు. ఆదర్శ్ తన హైస్కూల్ మరియు ఇంటర్మీడియట్ చదువును బారాబంకిలో పూర్తి చేశాడు. వీటిలో ఆదర్శ్ టాపర్ గా నిలిచాడు. అనంతరం ఆదర్శ్.. లక్నోలోని నేషనల్ పీజీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశాడు. అంతేకాకుండా బీఎస్సీలో మంచి ఉత్తీర్ణత సాధించి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు సొంతంగా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పరీక్షలకు హాజరు కాలేకపోయాడు. కానీ, రెండోసారి ప్రిపేర్ అయి పరీక్ష రాసి ఏకంగా 149వ ర్యాంకు సాధించాడు. అయితే ఆదర్శ్ ఈ ర్యాంకును ఎటువంటి కోచింగ్ లేకుండా సాధించడం గమనార్హం. ఆదర్శ్ కాంత్ శుక్లా తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణత సాధించి.. త్వరలో ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. 

తాను సివిల్ సర్వీసులకు ఎంపిక కావడం తన తండ్రి కోరిక అని ఆదర్శ్ చెప్పాడు. తనను, తన అక్కను చదివించడానికి తన తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడ్డారని ఆదర్శ్ తెలిపాడు. అందకే తన విజయాన్ని వారికి అంకితమిస్తున్నానని చెప్పాడు. చిన్న వయసులోనే ఐపీఎస్‎కు ఎంపికైన ఆదర్శ్‎ను అనేక రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యావేత్తలు మరియు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

For More News..

దిశను మార్చుకున్న గులాబ్ తుఫాన్..

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్