గల్లీకో బెల్ట్‌ షాప్.. మద్యం మత్తులో అఘాయిత్యాలు

గల్లీకో బెల్ట్‌ షాప్.. మద్యం మత్తులో అఘాయిత్యాలు

రాష్ట్రంలో  లిక్కర్ ఏరులై పారుతోంది..ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత ఇండ్లమధ్యే దొరుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరికి వెళ్లినా కనీసం నాలుగు నుంచి పది బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. బుధవారం మహిళపై అత్యాచారం జరిగిన నల్గొండ జిల్లా ముషం పల్లిలోనే 8 బెల్టుషాపులు ఉన్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా 2,216 లిక్కర్ షాపులుంటే ..వాటి పరిధిలోని బెల్టు షాపులు ఏకంగా లక్షకు పైగా  నడుస్తున్నాయని ఆబ్కారీ శాఖ ఆఫీసర్లే ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.ఫుల్లుగా తాగుతున్న కొందరు మద్యం మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు.లిక్కర్ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడుతున్న సర్కార్  దానివల్ల జరుగుతున్న అనర్థాలనుఏ మాత్ర పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా టార్గెట్లు పెడుతూ మద్యం సేల్స్ పెంచేలా ఆబ్కారీ శాఖపైఒత్తిడి తెస్తోంది.రాష్ట్రంలో 2014-15 లిక్కర్ ఆదాయం రూ.10,880 కోట్లు ఉండగా,2020 -21లో రూ.27,280 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఏకంగా రూ.30 వేల కోట్లు రావాలని సర్కారు టార్గెట్ పెట్టింది.  దీంతో లక్ష్యం చేరుకోవడం కోసం ఆబ్కారీ శాఖ ఆఫీసర్లు ..విచ్చలవిడిగా లిక్కర్ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. వాడవాడలా బెల్టు షాపులు తెరుస్తున్నా పట్టించుకోవడం లేదు.

ఈ ఆర్థిక సంవత్సరం 4 నెలల్లోనే రూ.9,509కోట్ల ఆదాయం తెచ్చారంటే ఆదాయం ఏ లెవల్లో వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలదన్నట్లుగా సర్కారు ఆదేశాలతో కొత్తగా మరో్ 225 వైన్స్ ఏర్పాటుకు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. మరో వైపు మద్యం మత్తులోనే మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. 2019లో 4,260 లైంగిక వేధింపుల కేసులు..2019లో 1780 అత్యాచారాలు,193 హత్యలు జరగగా..2020లో 1934 రేప్ లు ,161 మర్డర్లు జరిగినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.