మెదక్ జిల్లాలో మాహిళలకు 227 సర్పంచ్ స్థానాలు

మెదక్ జిల్లాలో మాహిళలకు 227 సర్పంచ్ స్థానాలు

మెదక్, వెలుగు: గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో మహిళలకు 227 గ్రామ పంచాయతీలు రిజర్వ్​ చేయగా, 265 స్థానాలు జనరల్ అయ్యాయి. కేటగిరీల వారీగా చూస్తే 100 శాతం గిరిజన జనాభా ఉన్న 31 తండా పంచాయతీలు మహిళలకు, 40 పంచాయతీలు జనరల్ కు కేటాయించారు. ఇతర చోట్ల 11 ఎస్టీ మహిళలకు, 10 ఎస్టీ జనరల్ కు, 33 పంచాయతీలు ఎస్సీ మహిళలకు, 44 ఎస్సీ జనరల్ కు, 86 పంచాయతీలు బీసీ మహిళలకు, 93 బీసీ జనరల్ కు రిజర్వ్ అయ్యాయి. 66 ఓసీ మహిళలకు, 78 ఓసీ జనరల్ కు కేటాయించారు. 

వార్డు స్థానాలు ఇలా...

492 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 4,220 వార్డులు ఉండగా వాటిలో 1,847 వార్డులు మహిళలకు రిజర్వ్ కాగా 2,373 జనరల్ అయ్యాయి. కేటగిరీ వారిగా చూస్తే 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న వాటిలో 263 వార్డులు ఎస్టీ మహిళలకు, 263 జనరల్ కు, ఇతర పంచాయతీల్లో 65 ఎస్టీ మహిళలకు, 113 ఎస్టీ జనరల్ కు, 254 ఎస్సీ మహిళలకు, 407 ఎస్సీ జనరల్ కు, 781 వార్డులు బీసీ మహిళలకు, 927 బీసీ జనరల్ కు, 684 ఓసీ మహిళలకు, 663 ఓసీ  జనరల్ కు కేటాయించారు.