జూరాల గేట్లు మళ్లీ ఓపెన్‌

జూరాల గేట్లు మళ్లీ ఓపెన్‌
  • 23 గేట్లు ఎత్తి నీటి విడుదల

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్ కు మళ్లీ వరద ప్రారంభమైంది. దీంతో 23 గేట్లను ఓపెన్‌ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ప్రాజెక్ట్‌ ల నుంచి జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల ప్రాజెక్ట్‌ లో 317.640 మీటర్ల మేర నీటిని నిల్వ చేసి గేట్ల ద్వారా 91,287 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్ట్‌ లోకి వదులుతున్నారు.

అలాగే విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 29,357 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్- –1కు 650, నెట్టెంపాడుకు 750, కోయిల్‌సాగర్‌కు 315, లెఫ్ట్‌ కెనాల్‌కు 1,030, రైట్‌ కెనాల్‌కు 600, ఆర్డీఎస్ లింక్‌ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 700, భీమా లిఫ్ట్‌ –2కు 750 కలిపి మొత్తం 1,25,405 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  

563 అడుగులకు సాగర్‌

హాలియా : ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 563.10 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్‌ ఉత్పతి కేంద్రాల ద్వారా 67,133 క్యూ సెక్కుల నీరు సాగర్‌కు వస్తోంది. సాగర్‌ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.040 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 563.10 అడుగుల (239.3427 టీఎంసీలు) నీరు చేరింది. హైదరాబాద్‌ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం ఏఎమ్మార్పీకి 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.