- 23 మందికి గాయాలు
జోగిపేట, వెలుగు : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లడంతో 23 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం కన్‌సాన్‌పల్లి వద్ద హైవేపై శుక్రవారం జరిగింది. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 57 మంది ప్రయాణికులతో సంగారెడ్డికి వెళ్తోంది. ఈ క్రమంలో కన్‌సాన్‌పల్లి వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
దీంతో బస్సులో ఉన్న 23 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.