వీర సైనికుల త్యాగాన్ని స్మరించుకునేందుకు సర్వం సిద్ధం

వీర సైనికుల త్యాగాన్ని స్మరించుకునేందుకు సర్వం సిద్ధం

23వ కార్గిల్ విజయ్ దివస్ సంస్మరణ కార్యక్రమాల నేపథ్యంలో లఢఖ్ లోని ద్రాస్ లో కార్గిల్ యుద్ద స్మారకం దగ్గర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాదీ జులై 26న వీర సైనికుల త్యాగానికి ప్రతీకగా విజయ్ దివస్ ను జరుపుకోవడం అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి కూడా యుద్దంలో కోల్పోయిన అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు భారత్ సిద్ధమైంది. కాగా 1999లో కార్గిల్ ఆక్రమించేందుకు పాక్ పన్నిన పన్నాగాన్ని భారత సైన్యం పటాపంచలు చేసింది. ఆపరేషన్ విజయ్ పేరుతో సైనిక చర్యను ప్రారంభించిన భారత ఆర్మీ.. పాక్ సైన్యం ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అది 1999 మే నుంచి జులై వరకు కొనసాగింది. ఈ విజయానికి గుర్తుగా ఏటా జులై 26న విజయ్ దివస్ ను జరుపుకుంటాం. అయితే ఈ యుద్దంలో భారత్ కు చెందిన 527 మంది యోధులు ప్రాణాలు కోల్పోగా.. పాక్ కి చెందిన 400 నుంచి 4000 మంది చనిపోయి ఉంటారని అంచనా.