
నారాయణపేట: తేనెటీగల దాడిలో 24 మంది స్టూడెంట్స్ గాయపడ్డ సంఘటన నారాయణపేట నియోజకవర్గంలో జరిగింది. కోయిలకొండ మండలం సురారంలోని ప్రభుత్వ హై స్కూల్ లో శనివారం విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి.
సమాచారం అందుకున్న గ్రామస్తులు, ఉపాధ్యాయులు గాయపడ్డ విద్యార్థులను మహబూబ్‌నగర్ జిల్లా హస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు డాక్టర్లు.