
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్మన చేతికి వచ్చింది. డ్యామ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం తాత్కాలికంగా ప్రాజెక్టును తెలంగాణ చేతికిస్తూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఫ్లడ్సీజన్ మొత్తం ప్రాజెక్టు బాధ్యతలను చూసేలా తెలంగాణకు అనుమతులిస్తూ బోర్డు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు ఉత్తర్వులతో డిసెంబర్ వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సాగర్డ్యామ్నిర్వహణను చూసే అవకాశం ఏర్పడింది. సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరదలు వస్తుండడంతో.. మంగళవారం ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులు ఎత్తారు.
ఈ నేపథ్యంలోనే స్పిల్ వే గేట్లతో పాటు అక్కడ మెకానికల్వ్యవహారాలను చూడాల్సి ఉంటుంది. ప్రాజెక్టు ఆపరేషన్స్‌కు డ్యామ్‌పైకి అధికారులను అనుమతించాలంటూ ఈ నెల 17వ తేదీనే కృష్ణా బోర్డుకు ఈఎన్సీ జనరల్అంజద్హుస్సేన్లేఖ రాశారు. స్పిల్ వే గేట్ల నిర్వహణను చూడాల్సి ఉండడం, సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉండడంతో తమ అధికారులను నిత్యం డ్యామ్‌పైకి అనుమతించాలని ఆ లేఖలో ఈఎన్సీ కోరారు. అందుకు అనుగుణంగా డ్యామ్ వద్ద డ్యూటీలు చేసే అధికారుల లిస్టును పంపించారు.
షిఫ్టులవారీగా డ్యూటీలు
ఫ్లడ్సీజన్కావడంతో అధికారులు షిఫ్ట్‌ల వారీగా రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, అందుకు డ్యామ్‌పైకి వెళ్లాల్సి ఉంటుందని బోర్డు దృష్టికి ఈఎన్సీ తీసుకెళ్లారు. కొందరు ఉద్యోగులు ఏపీ వైపు నివసిస్తున్నారని, హిల్‌కాలనీలో ఆఫీసుకు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇటు డ్యామ్ ఎడమ వైపు మెయింటెనెన్స్చేయాలన్నా తిరిగి వస్తుండడంతో ఎక్కవ దూరం అవుతున్నదని చెప్పారు.
ఈ క్రమంలోనే వారి విధులకు ఆటంకం కలగకుండా.. డ్యామ్మెయింటెనెన్స్ను సమర్థంగా నిర్వహించడానికి అధికారులను డ్యామ్‌పై నుంచి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఏఈఈల నుంచి సీఈ స్థాయి అధికారులతోపాటు.. మజ్దూర్లు, ఆపరేటర్లు, డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికుల లిస్టును పంపించారు. తాజాగా అందుకు కృష్ణా బోర్డు ఆమోదం తెలిపింది. ఫ్లడ్ సీజన్ ముగిసే డిసెంబర్ 31 వరకు వారిని డ్యామ్ పైకి అనుమతిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తంగా 101 మంది అధికారులు, 69 మంది ఇతర సిబ్బందికి డ్యామ్‌పైకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడినట్టయింది.