
ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా-పాక్ సీజ్ ఫైర్ పై ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్నారని.. ఖండించే ధైర్యం ప్రధాని మోదీకి లేదని విమర్శించారు. తన వల్లే సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందని ట్రంప్ చెప్తున్నా ప్రధాని ఎందుకు మాట్లాడలేక పోతున్నారని మండిపడ్డారు. ఒకవేళ ట్రంప్ చెప్పేదే నిజమైంతే ఎవరో చెబితే ప్రధాని ఎలా నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
ట్రంప్ చెప్పేది అబద్ధమైతే.. గట్టిగా ఎందుకు ఖండిచడం లేదని అన్నారు. అంటే ఇద్దట్లో అబద్ధం ఆడుతున్నదెవరో చెప్పాలని నిలదీశారు. ట్రంప్ అబద్ధం చెబుతున్నారని అయినా చెప్పాలి.. లేదంటే తాము యూఎస్ ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్ తో యుద్ధాన్ని విరమించుకున్నామని అయినా చెప్పాలని డిమాండ్ చేశారు.
టారిఫ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ట్రంప్ మరోసారి ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు ప్రకటించారు. పహల్గాం అటాక్, ఆపరేషన్ సిందూర్, సీజ్ ఫైర్ పై ట్రంప్ ప్రకటన మొదలైన అంశాలపై ఇప్పటికే పార్లమెంటులో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో నిజానిజాలు బయటపెట్టాలని ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడితో చర్చ చేపట్టిన ప్రభుత్వం.. ఆపరేషన్ సిందూర్ ఎవరి ఒత్తిడి వల్లనో ఆపలేదని.. పాకిస్తానే కాళ్లబేరానికి వచ్చినట్లు ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మొదటగా ఆ ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా.. ఎవరికో భయపడి యుద్ధాన్ని ఆపలేదుని.. ఈ విషయంలో అమెరికా వైస్ ప్రసిడెంట్ మాట్లాడాలని చూసినా తాను తోసిపుచ్చినట్లు మోదీ లోక్ సభలో ప్రకటించారు.
అమెరికా జోక్యం లేదని ఒకవైపు ప్రభుత్వం నొక్కి చెబుతున్న సందర్భంలో.. మరో సారి ట్రంప్ అదే ప్రకటన చేయడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్కే ఘాటుగా స్పందించారు. ఇప్పటికే 29 సార్లు ట్రంప్ ప్రకటన చేశారు.. 30 కి చేరుకుంటుందని చెప్పానని.. అన్నట్లే ట్రంప్ మరోసారి అదే మాట అన్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని దాటవేస్తుందని అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా.. మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంపేమో సీజ్ ఫైర్ కు కారణం నేనేనని.. ఇరు దేశాలతో మాట్లాడి కాల్పుల విరమణ ఒప్పందం చేయించానని చెబుతారు.. ట్రంపేమో మాట్లాడానని అంటారు.. మోదీనేమో మాతో ఎవరూ మాట్లాడలేదని అంటారు. అంటే ఇద్దట్లో అబద్ధం చెబుతున్నది ఎవరి.. మోదీ అబద్ధం ఆడుతున్నారా..? ట్రంప్ ఆడుతున్నారా..? ట్రంప్ అసత్యాలు పలుకుతున్నారని దమ్ముంటే మోదీ ప్రటించాలని డిమాండ్ చేశారు.