నాగార్జున చేతిలో 14 చెంపదెబ్బలు తిన్నా.. బుగ్గలు వాచిపోయాయి.. చంద్రలేఖ నటి

నాగార్జున చేతిలో 14 చెంపదెబ్బలు తిన్నా.. బుగ్గలు వాచిపోయాయి..  చంద్రలేఖ నటి

సినీ ప్రపంచంలో నటీనటులు ఎంతో అంకితభావంతో పాత్రలో లీనమైపోతారు. అప్పుడే ఆ పాత్రకు తగ్గ ఫలితం వస్తుంది. అలాంటిదే ఇప్పుడు  ప్రముఖ నటి ఇషా కొప్పికర్ ( Isha Koppikar ) తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఒక అనుభవం చర్చకు వచ్చింది.  ఆమె ఇటీవల ఓ ఇంటర్యూలో అక్కినేని నాగార్జున ( Nagarjuna )  గురించి షాకింగ్ విషయాలు భయటపెట్టింది. ఆయనతో షూటింగ్ సయమంలో జరిగిన సంఘటనను, ఇబ్బందులను పంచుకున్నారు.  ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఇషా.. 1998లో చంద్రముఖి ( Chandralekha ) మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన లేఖ పాత్రలో ఆమె నటించింది.  ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాంతం గుర్తిండిపోతుందని చెప్పుకొచ్చారు.  సినిమాలో ఒక కోపంతో కూడిన సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు అవుట్ పుట్ సరిగ్గా రాలేదు.  ఈసీన్ కోసం కోపంగా కనిపించే ప్రయత్నంలో అనేక సార్లు రిటేక్ తీసుకున్నాం.  కానీ నాగార్జున నన్ను చెంపదెబ్బ కొడుతున్నప్పుడు నాకు నొప్పి అనిపించలేదు. అది నా రెండో సినిమా. అందుకే నాగ్ మీరు నిజంగా కొట్టండి' అని కోరాను. ఆయన 'నిజంగానా? నేను అలా చేయలేను' అన్నారు. కానీ నాకు ఆ ఫీలింగ్ రావాలని, అప్పుడే ఆ సన్నివేశానికి ప్రాణం వస్తుందని చెప్పాను అని ఇషా వివరించారు.

నాగార్జున సున్నితంగా కొట్టడంతో కోపం ఫీలింగ్ , కన్నీళ్లు రాలేదు.  ఆ కోపాన్ని తెరపైకి తీసుకురావడంలో, కెమెరాకు తన భావాలు సరిగా పట్టుబడటంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కోపాన్ని పండించే ప్రయత్నంలో, నేను 14 సార్లు చెంపదెబ్బలు తిన్నాను అని  ఇషా వెల్లడించారు.  గట్టిగా కొట్టడంతో నా చెంపపై వాతలు కూడా పడ్డాయి. కానీ ఆయన నన్ను కూర్చోబెట్టి సారీ చెప్పారు.  మీరు ఎందుకు సారీ చెబుతున్నారు అని అడిగానని చెప్పుకొచ్చారు. 

►ALSO READ | Junior OTT: ప్రైమ్ ఓటీటీలోకి శ్రీలీల, కిరీటి ‘జూనియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'చంద్రలేఖ' మూవీ తర్వాత ఇషా తమిళ చిత్రం 'కాదల్ కవితై'లో నటించి, ఉత్తమ తొలి నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్‌లో 'ఫిజా', 'ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్', 'పింజర్', 'క్యా కూల్ హై హమ్', 'డాన్', 'సలామ్-ఎ-ఇష్క్: ఎ ట్రిబ్యూట్ టు లవ్', 'డార్లింగ్' వంటి పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఆమె చివరిగా 'సురంగ' , 'దహనం' అనే వెబ్ సిరీస్‌లలో కనిపించారు. ఇషా కొప్పికర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఆమె ధైర్యాన్ని, నటన పట్ల ఆమెకున్న నిబద్ధతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు..