Rishab Shetty: తిరుగుబాటుదారుడిగా రిషబ్ శెట్టి.. నిర్మాత నాగవంశీ బ్యానర్లో భారీ హిస్టారికల్ ఫిల్మ్

Rishab Shetty: తిరుగుబాటుదారుడిగా రిషబ్ శెట్టి.. నిర్మాత నాగవంశీ బ్యానర్లో భారీ హిస్టారికల్ ఫిల్మ్

హీరో కం డైరెక్టర్ రిషబ్‌‌‌‌ శెట్టి (Rishab Shetty) కాంతారా ప్రీక్వెల్ తెరకెక్కిస్తూనే మరిన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. లేటెస్ట్గా మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఈసారి డైరెక్ట్గా తెలుగు ఫిల్మ్లో నటిస్తుండటం విశేషం. 

ఇవాళ (జూలై 30న) ఇందుకు సంబంధించిన అప్డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. పౌరాణిక/చారిత్రక/పీరియడ్ డ్రామాలో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేస్తూ వివరాలు వెల్లడించింది. ‘యుద్ధంలో అందరు తిరుగుబాటుదారులు వారికే వారే పుట్టరు. కొంతమందిని డెస్టినీ ఎంచుకుంటుంది. ఇది ఒక తిరుగుబాటుదారుడి కథ’ అని క్యాప్షన్ ఇచ్చింది. 

ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. 18వ శతాబ్దంలో జరిగే హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని పోస్టర్ ద్వారా అర్ధమవుతుంది. 18వ శతాబ్దపు అల్లకల్లోల బెంగాల్ ప్రావిన్స్ కాలంలో తిరుగుబాటుదారుల ఆవిర్భావం గురించి చెప్పబోతున్నట్లు టాక్. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

►ALSO READ | 90s Stars Reunite: 90'sల్లో వెండితెరను ఏలిన సినీ స్టార్స్.. గోవాలో మళ్లీ కలిశారు.. వారెవరో చూసేయండి

రిషబ్ శెట్టి వరుస తెలుగు సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవలే ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీలో హనుమంతుని పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఇపుడీ నాగవంశీ బ్యానర్లో మూవీ చేయడానికి సిద్దమయ్యాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే.. రిషబ్కు టాలీవుడ్లో మంచి మార్కెట్ రావడం కన్ఫర్మ్ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే కనుక జరిగితే ఒక కన్నడ హీరో తెలుగులోకి వచ్చి రికార్డు క్రియేట్ చేసినవాడిగా రిషబ్ శెట్టి నిలుస్తాడు. మరోవైపు, రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేసిన కాంతారా ప్రీక్వెల్ అక్టోబర్ 2న రీలిజ్ కానుంది. అలాగే, సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ 2027 జనవరి 21న రానుంది.