లోకల్ క్యాండిడేట్కే సీటు.. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు మనదే : మంత్రి వివేక్ వెంకటస్వామి

లోకల్ క్యాండిడేట్కే సీటు..  జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు మనదే : మంత్రి వివేక్ వెంకటస్వామి

కార్యకర్తలు కష్టపడి పని చేస్తే  జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  హైదరాబాద్ లోని  షేక్ పేట్ డివిజన్ బూత్ లెవల్ మీటింగ్ కు మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు,మహ్మద్ అజారుద్దీన్ తో పాటు పలువురు కాంగ్రెస్  నేతలు కూడా ఈ మీటింగ్ కు  హాజరయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నేతలకు వివేక్ దిశానిర్దేశం చేశారు. 

అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన..లోకల్ వ్యక్తికే  జూబ్లీహిల్స్  సీటు ఇస్తామన్నారు . సర్వేలు ఎవరు చేసినా పార్టీ మంచి క్యాండిడెంట్ ను నిర్ణయిస్తుందని చెప్పారు.  అందరూ పార్టీ కోసం పనిచేయాలన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో  షేక్ పెట్ డివిజన్ నుంచి మంచి  మెజార్టీ రావాలన్నారు.షేక్ పేట్ డివిజన్ లో   30 వేల మెజారిటీ వస్తదని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ లో  ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని సూచించారు. 

 బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలని చెప్పారు.  ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.  బూత్ స్థాయి ఇన్ ఛార్జ్ లు అందరిని సమన్వయం చేయాలని సూచించారు. నేతలు,కార్యకర్తలు సమిష్టిగా కలిసి పనిచేయాలని కోరారు.  కార్యకర్తల కష్టాన్ని పార్టీ తప్పక గుర్తిస్తుందని చెప్పారు వివేక్ వెంకటస్వామి.

►ALSO READ | కాళేశ్వరాన్ని కావాలనే పండబెట్టిన్రు .. కేటీఆర్, హరీశ్ ఇతర నేతలతో ఫాం హౌస్లో భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికకు ఇంకా షెడ్యూల్ రాలేదు. కానీ అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ ట్రై చేస్తుండగా.. ఎలాగైనా జూబ్లీహిల్స్ లో పాగా వేయాలని కాంగ్రెస్,బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.