దేశంలో 24,000 దాటిన కరోనా మరణాలు

దేశంలో 24,000 దాటిన కరోనా మరణాలు
  • ఒక్కరోజులో 29,429 కేసులు
  • 582 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 29,429 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,36,181కి చేరింది. ఒక్క రోజులో 582 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. దేశంలో మరణాల సంఖ్య 24,309కి చేరింది. ప్రస్తుతం 3,19,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. 5,92,032 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని అన్నారు. ప్రస్తుతం దేశంలో 63.92 శాతం రికవరీ రేటు ఉండగా.. మరణాల రేటు 2.61శాతంగా ఉంది. దేశంలోని 86 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని అధికారులు చెప్పారు. దాంట్లో 50 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడులోనే ఉన్నాయని అన్నారు. కర్నాటక, ఢిల్లీ, ఏపీ, ఉత్తర్‌‌ప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, వెస్ట్‌బెంగాల్‌, గుజరాత్‌, అస్సాంలో దాదాపు 36 శాతం కేసులు నమోదైనట్లు చెప్పారు.