
ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2,410 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 8,38,363 కి చేరింది. 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 6,768 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 21,825 యాక్టివ్ కేసులున్నాయి.
శుక్రవారం కరోనాతో కృష్ణా 3, చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల్లో.. అనంతపురం 161, చిత్తూరు 253, తూర్పుగోదావరి 401, గుంటూరు 323, కడప 132, కృష్ణా 298, కర్నూలు 23, నెల్లూరు 121, ప్రకాశం 108, శ్రీకాకుళం 71, విశాఖపట్నం 142, విజయనగరం 79, పశ్చిమ గోదావరి 298 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.