
రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ డేట్‌కు సినిమా విడుదల కాదనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
కొన్ని అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడనుందని, చవితి నుంచి దీపావళి షిఫ్ట్ కానుందని తెలుస్తోంది. ఈ రిలీజ్ డేట్‌పై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. రవితేజ కెరీర్‌లో ఇది 75వ చిత్రం. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.