అన్నబాహు సాఠే ఆశయసాధనకు కృషి చేద్దాం : విశ్వనాథ్ రావు

అన్నబాహు సాఠే ఆశయసాధనకు కృషి చేద్దాం : విశ్వనాథ్ రావు
  • ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్ రావు 

జైనూర్, వెలుగు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్నబాహు సాఠే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గణేశ్ నగర్ కాలనీలో జరిగిన అన్నబాహు సాటె జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం సాహిత్యం ద్వారా చైతన్యం నింపిన మహనీయుడని తెలిపారు.  పాక్స్ చైర్మన్ హన్ను పటేల్, రాష్ట్ర దళిత సంఘం నాయకులు గైక్వాడ్ దత్తా, కాంబ్లే ఉదయ్, అంబేద్కర్ అసోసియేషన్  జైనూర్ ప్రెసిడెంట్ బాబా సాహెబ్, నాయకులు మోవాలే దత్త, అంబాజీ రావు, దయానంద్, కాంబ్లె అన్నారావు పాల్గొన్నారు.