ఆరే కులస్థులకు అండగా ఉంటాం : దండే విఠల్

ఆరే కులస్థులకు అండగా ఉంటాం : దండే విఠల్

ఎమ్మెల్సీ దండే విఠల్ 

కాగజ్‌నగర్, వెలుగు: ఆరే కులస్థులకు అండగా నిలిచి అభివృద్ధికి కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఆదివారం సిర్పూర్ టీ మండల కేంద్రం లో రూ. 25 లక్షలతో ఆరే సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని కులాలకు సమ ప్రాధాన్యతతో అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని అన్నారు. ఆరే కులస్థులకు నియోజకవర్గంలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఆరే సంఘం నాయకులు పాల్గొన్నారు.