బీఆర్ఎస్ పార్టీపాపాల చిట్టా విప్పుతా..అవినీతి పార్టీలో ఉండలేకనే బయటికొచ్చా: గువ్వల బాలరాజు

బీఆర్ఎస్ పార్టీపాపాల చిట్టా విప్పుతా..అవినీతి పార్టీలో ఉండలేకనే బయటికొచ్చా: గువ్వల బాలరాజు

శంషాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాపాల చిట్టాను ఒక్కొక్కటిగా ప్రజల ముందు పెడతానని, అవినీతిలో కూరుకుపోయిన ఆ పార్టీలో ఉండలేకనే బయటికి వచ్చానని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గువ్వల బాలరాజు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని షాపూర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నంతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. సంపదనంతా తన కుటుంబానికి దోచి పెట్టారని ఆరోపించారు.

కేసీఆర్ మెప్పు కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎంతో మంది దళితులను బూటకపు ఎన్​కౌంటర్లు చేసిన చరిత్ర ఆయనదని ఆరోపించారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.