జీహెచ్ఎంసీ ప్రజావాణికి 242 ఫిర్యాదులు

జీహెచ్ఎంసీ ప్రజావాణికి 242 ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 242 ఫిర్యాదులు వచ్చాయి. హెడ్ ఆఫీసులో 137 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో హౌసింగ్​కు సంబంధించి 53, టౌన్ ప్లానింగ్ 42, ఇంజినీరింగ్ 15, అడ్మిన్ 6, ఎస్టేట్ 5, ఎలక్ట్రికల్ 2, ట్యాక్స్ 8, ఎంటమాలజీ ఒకటి, ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించి ఒక ఫిర్యాదు అందాయి. ఫోన్ ఇన్ కార్యక్రమానికి15 ఫిర్యాదులు వచ్చాయి. 

అడిషనల్ కమిషనర్లు కే.శ్రీనివాస్, సత్యనారాయణ, ఉపేందర్ రెడ్డి, నళిని ప్రసాద్, చంద్ర కాంత్ రెడ్డి, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్  ఫిర్యాదులను స్వీకరించారు. అదేవిధంగా గ్రేటర్ లోని 6 జోన్లకు సంబంధించి 105 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో చార్మినార్ జోన్ లో 9, సికింద్రాబాద్ జోన్ లో 12, కూకట్ పల్లి జోన్ లో 49, శేరిలింగంపల్లి జోన్ 21, ఖైరతాబాద్ జోన్ 4, ఎల్బీనగర్ జోన్ లో 10 ఫిర్యాదులు వచ్చాయి. టౌన్ ప్లానింగ్ కు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.