కోల్డ్ వేవ్‌‌ కు బైబై..జనవరి1 నుంచి తగ్గనున్న చలి!

కోల్డ్ వేవ్‌‌ కు బైబై..జనవరి1 నుంచి తగ్గనున్న చలి!
  • రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం
  • నెల రోజులుగా గ్యాప్​ లేకుండా చలిగాలులు
  • జనవరి రెండో వారంలో అకాల వర్షాలకు చాన్స్​

హైదరాబాద్, వెలుగు: ఈ నెలాఖరుతో కోల్డ్​వేవ్‌‌కు ఎండ్​కార్డు పడనున్నది. ఇప్పటిదాకా గజగజా వణికించిన చలి ఇక తగ్గుముఖం పట్టనున్నదని వెదర్​ఆఫీసర్లు వెల్లడించారు. ఈ నెల మొదలు.. ఇప్పటిదాకా చలి తీవ్రత  ఓ రేంజ్‌‌లో ఉన్నది. గ్యాప్​ లేకుండా ప్రతిరోజూ చలిగాలులు వీచాయి. 

ప్రతిరోజూ నైట్​ టెంపరేచర్లు సింగిల్​ డిజిట్‌‌లోనే నమోదయ్యాయి. ఎప్పుడు లేనంతగా ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  కాగా, జనవరి 1 నుంచి రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ​అధికారులు తెలిపారు. మరోవైపు కోల్డ్​ వేవ్​ ముగిసినా.. చలి మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు.

 జనవరి తొలివారం చివర లేదంటే రెండో వారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ వీక్లీ బులెటిన్‌‌లో వెల్లడించింది. 

ఇటు, కోల్డ్ వేవ్​ అలర్ట్స్‌‌‌‌నూ క్రమంగా తగ్గిస్తున్నది. ఈ 4 రోజులపాటు కొన్ని జిల్లాల్లోనే చలి ప్రభావం ఉంటుందని పేర్కొన్నది. మరోవైపు జిల్లాల్లోనూ చలి తీవ్రత కాస్తంత తగ్గుముఖం పట్టింది. సింగిల్​ డిజిట్​ టెంపరేచర్​ నమోదైన జిల్లాలు ఆరుకు తగ్గాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్‌‌‌‌‌‌‌‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీల నైట్​ టెంపరేచర్​ నమోదైంది. 

సంగారెడ్డి జిల్లా కోహిర్‌‌‌‌‌‌‌‌లో 7.6 డిగ్రీలు, ఆదిలాబాద్​జిల్లా అర్లి (టీ)లో 8.8, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 9.2, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 9.4, కామారెడ్డి జిల్లా రామలక్ష్మణపల్లిలో 9.5 డిగ్రీల చొప్పున నైట్​టెంపరేచర్లు నమోదయ్యాయి. నిర్మల్​ జిల్లా పెంబిలో 10 డిగ్రీలుగా రికార్డయింది. 11 జిల్లాల్లో 10.1 నుంచి 10.9 మధ్య నైట్​ టెంపరేచర్లు నమోదుకాగా.. 10  జిల్లాల్లో 11 నుంచి 11.6 మధ్య, 2 జిల్లాల్లో 12 డిగ్రీలు, మరో 3 జిల్లాల్లో 13 డిగ్రీల రేంజ్‌‌‌‌లో రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

సిటీలోనూ తగ్గుముఖం 

హైదరాబాద్​ సిటీలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శివారు ప్రాంతాలు, చెట్లు (అటవీ సంపద) ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం చలి ప్రభావం కనిపిస్తున్నది. యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​ పరిధిలో అత్యల్పంగా 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

 మౌలాలిలో 10.7, అల్వాల్​ పరిధిలోని టెలికం కాలనీలో 10.8, రాజేంద్రనగర్​లో 11.1, మచ్చబొల్లారంలో 11.1, గచ్చిబౌలిలో 11.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో చలి ప్రభావం మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.