బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం

బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం
  • అఖిల పక్ష పార్టీలు, బీసీ కుల సంఘాల పిలుపు

బషీర్​బాగ్, వెలుగు: 42 శాతం బీసీల రిజర్వేషన్ల సాధన కోసం అసెంబ్లీని ముట్టడిస్తామని అఖిల పక్ష పార్టీలు, బీసీ కుల సంఘాలు స్పష్టం చేశాయి. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన శనివారం కాచిగూడలో అఖిల పక్ష బీసీ సంఘాలు, కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరింది. 

సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆర్. కృష్ణయ్య, ఎస్.మధుసూదనాచారి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, గుజ్జ కృష్ణ పాల్గొని మాట్లాడారు. పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నేతలు బీసీ రిజర్వేషన్ల సాధనకు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.