డీఎస్సీకి 2.45 లక్షల మంది అటెండ్

డీఎస్సీకి 2.45 లక్షల మంది అటెండ్
  •  వారంలో వెబ్ సైట్​లో రెస్పాన్స్ షీట్లు

హైదరాబాద్, వెలుగు: గత నెల18న ప్రారంభమైన డీఎస్సీ ఎగ్జామ్స్  సోమవారంతో పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వీరిలో పరీక్షలకు మాత్రం 2,45,263 (87.61%) మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను ఈ నెల 12 లేదా 13 తేదీల్లో వెబ్ సైట్ లో పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వారం రోజుల పాటు ఆబ్జెక్షన్లు స్వీకరించి, ఈ నెలాఖరులో ఫలితాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.