సెబీ స్కోర్స్‌‌‌‌‌‌‌‌తో 2,457 ఫిర్యాదులు పరిష్కారం

సెబీ స్కోర్స్‌‌‌‌‌‌‌‌తో 2,457 ఫిర్యాదులు పరిష్కారం

న్యూఢిల్లీ: సెబీ రిడ్రెస్సల్ మెకానిజం స్కోర్స్ ద్వారా కిందటి నెలలో  2,457 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. కంపెనీలు,  మార్కెట్‌‌‌‌‌‌‌‌లోని మధ్యవర్తులకు వ్యతిరేకంగా ఈ ఫిర్యాదులు ఫైల్ అయ్యాయి. సెబీ డేటా ప్రకారం,  కిందటి నెల ప్రారంభంలో 2,984  ఫిర్యాదులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. కొత్తగా 2,626 ఫిర్యాదులు వచ్చాయి. మే నాటికి మూడు నెలల కంటే ఎక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌ నుంచి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫిర్యాదులు 28 ఉన్నాయి. ఈ ఫిర్యాదులు  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ అడ్వైజరీ, రీసెర్చ్ ఎనలిస్టులు, కార్పొరేట్ గ్రీవెన్స్ లేదా లిస్టింగ్ పరిస్థితులు, మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్‌‌‌‌‌‌‌‌, వెంచర్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ వంటి అంశాలకు రిలేటెడ్‌‌‌‌‌‌‌‌గా ఫైల్ అయ్యాయి. ఒక ఫిర్యాదును పరిష్కరించడానికి  సగటున 31 రోజులు పడుతోందని సెబీ పేర్కొంది.

 ఈ ఏడాది మే నాటికి  12 కంపెనీలకు వ్యతిరేకంగా మూడు నెలల కంటే ఎక్కువ టైమ్ నుంచి ఫిర్యాదులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయిని తెలిపింది. ఇందులో బ్రైట్‌‌‌‌‌‌‌‌ కామ్ గ్రూప్‌‌‌‌‌‌‌‌, అంకుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెయిన్‌‌‌‌‌‌‌‌, రీసెర్చ్ గురు, ఉమేష్ కుమార్ పాండే ప్రాప్రిటర్‌‌‌‌‌‌‌‌, ఆరోస్టార్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ అడ్వైజరీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌, ధర్మేష్ పార్మర్ , గ్రోవాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌, హైలైట్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ రీసెర్చ్ వంటి కంపెనీలు ఉన్నాయి. ‌‌‌‌‌‌‌‌కాగా, స్కోర్స్‌‌‌‌‌‌‌‌ను 2011 జూన్‌‌‌‌‌‌‌‌లో తీసుకొచ్చారు. ఈ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లు తమ ఫిర్యాదులను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో సెబీ వద్ద ఫైల్ చేసుకోవచ్చు.