సెప్టెంబర్‌ వర‌కు 25 కోట్ల మందికి వ్యాక్సిన్

సెప్టెంబర్‌ వర‌కు 25 కోట్ల మందికి వ్యాక్సిన్

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటుపై కేంద్ర మంత్రి హర్ష వర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. వచ్చే సెప్టెంబర్ నాటికి దేశంలో 25 నుంచి 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేస్తామని హర్ష వర్దన్ తెలిపారు. సమర్థమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్యమైన ఎజెండాగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 250 మంది వ్యాక్సిన్ క్యాండిడేట్లు ఉన్నారని, భారత్‌‌లో ఆ సంఖ్య 30 అని, అందులో ఐదుగురు వ్యక్తులు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ముందుగా హెల్త్ వర్కర్స్‌‌కు అందిస్తామన్నారు. ఆ తర్వాత పోలీసులు, పారామిలిటరీ బలగాలు, శానిటైజేషన్ సిబ్బందితోపాటు 65 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ చేస్తామని వివరించారు.