
టారిఫ్స్ పేరుతో ప్రపంచ దేశాలకు తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికాకు ప్రపంచ దేశాలు షాకిచ్చాయి. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి టారిఫ్స్.. టారిఫ్స్ అంటూ వివిధ దేశాలను లొంగదీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ట్రంప్ కు బుద్ధి చెప్పేందుకు 25 దేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. 25 దేశాలు యూఎస్ కు పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఐకరాజ్య సమితి పోస్టల్ ఏజెన్సీ కన్ఫామ్ చేసింది.
పోస్టల్ సర్వీసులు అంటే వివిధ దేశాల నుంచి యూఎస్ కు వెళ్లే ప్యాకేజింగ్, పార్సల్ లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ఇండియా అమెరికాకు పోస్టల్ సర్వీసులను నిలిపేస్తున్న ట్లు ప్రకటించింది. అదేవిధంగా యూరప్, ఏసియాలోని కీలక దేశాలు కూడా ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. లేటెస్ట్ గా ఆస్ట్రేలియా కూడా తాత్కాలికంగా సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆస్ట్రేలియాకు వచ్చే పార్సల్ సర్వీసులపై కూడా ట్యాక్స్ వేస్తామని ఇటీవలే ట్రంప్ ప్రకటించాడు. తక్కువ విలువ ఉన్న వాటిపై డ్యూటీ ఉండదని కానీ.. 800 డాలర్లకు పైగా ఉండే పార్సల్స్ పై డ్యూటీ తప్పదని హెచ్చరించాడు. గతంలో ఉన్న డీ మినిమిస్ మినహాయింపును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. కొత్తగా తీసుకొస్తున్న రూల్స్ తో పార్సల్ సిస్టమ్ పై రెండు రకాల టారిఫ్స్ వేసేందుకు సిద్ధమైంది యూఎస్.
ట్రంప్ నిర్ణయంతో ఆగ్రహం చెందిన దేశాలు.. సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నిర్ణయాన్ని ఈ మేరకు యూనివర్సల్ పోస్టల్ యూనియన్, యూనైటెడ్ నేషన్స్ ఏజెన్సీ నిర్ధారించింది. మరికొన్ని దేశాలు కూడా ఈ లిస్టులో చేరే ఛాన్స్ ఉంది.