
మిడ్ మానేరు రిజర్వాయర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతలతో దాదాపు 10వేలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది. రిజర్వాయర్ లోకి 15 టీఎంసీలకు నీరు చేరడంతో.. రిజర్వాయర్ 25గేట్లను ఎత్తి.. నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేస్తున్నారు. అటూ మిడ్ మానేరు డ్యాం గేట్లు ఓపెన్ చేయడంతో చూసేందుకు… చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. గేట్లు ఓపెన్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.