
ఇండియా టీనేజ్ సెన్సేషన్,19 ఏండ్ల దివ్య దేశ్‌ముఖ్ ఫిడే వరల్డ్ చెస్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్‌గా, దేశానికి వరల్డ్ కప్ అందించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. సోమవారం ముగిసిన ఫైనల్లో 2.5–1.5 తేడాతో తోటి ప్లేయర్, లెజెండ్ కోనేరు హంపిని టైబ్రేక్‌లో ఓడించి ఈ చారిత్రక విజయం అందుకుంది. ఈ విక్టరీతో చెస్‌లో అత్యున్నతమైన గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా కూడా అందుకుంది. ఇండియా నుంచి హంపి, హారిక, ఆర్. వైశాలి తర్వాత జీఎం హోదా అందుకున్న నాలుగో అమ్మాయిగా నిలిచింది. ఈ విజయానికి ఆమెకు భారీ నగదు బహుమతి దక్కింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం (ఆగస్టు 2) నాగ్‌పూర్‌లో FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌ను సత్కరించి, ఆమెకు రూ.3 కోట్ల నగదు పురస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఒక స్థానిక అమ్మాయి ప్రపంచ స్థాయిలో దేశం గర్వపడేలా చేయడం పట్ల భారతీయుడిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను గర్వపడుతున్నానని అన్నారు. దేశంలోని పిల్లలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం దేశ్‌ముఖ్ ప్రజా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిందని ఆయన అన్నారు.
Also Read : మొన్న గిల్.. నిన్న ఆకాష్, సుదర్శన్
మహారాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత సీఎం ఫడ్నవీస్ దేశ్‌ముఖ్‌కు రూ.3 కోట్ల నగదు బహుమతి చెక్కును అందజేసి ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. చెస్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. జీవితంలో ఇలాంటి క్షణాలను ఆస్వాదించడం చాలా అరుదు అని ఆమె అన్నారు. తనకు మద్దతు ఇచ్చినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర చెస్ సంఘానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. నేను చాలా సంతోషంగా ఉన్నానని ను అని తెలిపారు.
#WATCH | Nagpur, Maharashtra: Chief Justice of India BR Gavai felicitates Divya Deshmukh, who won the FIDE Women’s Chess World Cup final and also became India’s 88th Grandmaster. pic.twitter.com/XbsXUBGq9r
— ANI (@ANI) August 2, 2025