
ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ టీమిండియా ప్లేయర్లతో అనవసర గొడవలకు దిగుతున్నాడు. ఈ సిరీస్ లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లపై తన నోరు పారేసుకున్నాడు. లార్డ్స్ టెస్టులో భాగంగా గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలర్ క్రిస్ వోక్స్ దగ్గరకు వెళ్లి "ఈ సిరీస్ లో గిల్ 600 పరుగులతో సరిపెట్టుకోవాలి". అని చెప్పాడు. తొలి రెండు టెస్టుల్లో 600 పరుగులు చేసిన గిల్.. ఆ తర్వాత మూడు టెస్టుల్లో పరుగులు చేయకూడదని అతిగా ప్రవర్తించాడు. గురువారం (ఆగస్టు 1) ఓవల్ లో మొదలైన చివరిదైన ఐదో టెస్టులోనూ డకెట్ ఆకాష్ దీప్, సాయి సుదర్శన్ లను రెచ్చగొట్టాడు.
రెండో రోజు ఆటలో భాగంగా డకెట్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వేగంగా పరుగులు చేసి మన బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో ఆకాష్ దీప్ కెళ్ళి చూస్తూ ఇక్కడ నువ్వు ఔట్ చేయలేవు అని మాట్లాడాడు. 43 పరుగుల స్కోరుతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆకాష్ దీప్ ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ ను ఔట్ చేశాడు. రివర్స్ స్వీప్ చేయాలని చూసిన డకెట్..వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఔటైన తర్వాత ఆకాష్ దీప్.. డకెట్ దగ్గరకు వెళ్లి చేయి వేస్తూ అదిరిపోయే సెండ్ ఆఫ్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య బ్యాటిల్ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.
Akash Deep's send-off to Ben Duckett 👀 pic.twitter.com/e9nmaYxqeM
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2025
రెండో రోజు ముగుస్తుందనుకున్న సమయంలో అట్కిన్సన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ ఔటయ్యాడు. వికెట్ కోల్పోయిన తర్వాత బెన్ డకెట్, సాయి సుదర్శన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎల్బీడబ్ల్యూ కోసం ఇంగ్లాండ్ ప్లేయర్లు అప్పీల్ చేయడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ అహ్సాన్ రజా సాయి సుదర్శన్ ను ఔట్ గా ప్రకటించాడు. నాన్-స్ట్రైకర్ యశస్వి జైస్వాల్‌తో చర్చించిన తర్వాత సాయి సుదర్శన్ రివ్యూ కోరాడు. సుదర్శన్ ఔటై వెళ్తున్న సమయంలో డకెట్ రెచ్చగొట్టినట్టు కనిపించాడు. పెవిలియన్ కు వెళ్తున్న సాయి సుదర్శన్ వెనక్కి తిరిగి వచ్చి గొడవ పడ్డాడు.
Also Read : చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరనున్న రూ. 11 కోట్ల బౌలర్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే బ్యాటర్లు ఫెయిలైన చోట టీమిండియా పేసర్లు మ్యాజిక్ చేశారు. మహ్మద్ సిరాజ్ (4/86), ప్రసిధ్ కృష్ణ (4/62) చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. పట్టు జారిపోయిందనుకున్న ఐదో టెస్టులో మన జట్టును తిరిగి రేసులోకి తెచ్చారు. సిరాజ్, ప్రసిధ్ దెబ్బకు రెండో రోజు, శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో 51.2 ఓవర్లలో 247 రన్స్‌కే ఆలౌటై 23 రన్స్ లీడ్‌తో సరిపెట్టింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ఇండియా ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి 104 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Some words exchanged between Sai Sudharsan and Ben Duckett.
— CricTracker (@Cricketracker) August 1, 2025
📸: Jio Hotstar pic.twitter.com/npJAoZttwH