IPL 2026: ఢిల్లీ నుంచి సొంత నగరానికి: చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో చేరనున్న రూ. 11 కోట్ల బౌలర్

IPL 2026: ఢిల్లీ నుంచి సొంత నగరానికి: చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో చేరనున్న రూ. 11 కోట్ల బౌలర్

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ ఐపీఎల్ 2026 లో తమ జట్టును వీడే అవకాశం ఉందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ట్రేడ్ ద్వారా ఈ టీమిండియా పేసర్  చెన్నై సూపర్ కింగ్స్ కు  కి మారే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. శనివారం (ఆగస్టు 2) చెన్నైలోని CSK అకాడమీలో నటరాజన్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. నటరాజన్ కూడా తమిళ నాడు కావడంతో ఈ వార్తలకు మరింతగా బలం చేకూరింది. ఐపీఎల్ 2025 లో ఢిల్లీ జట్టు నటరాజన్ పై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ట్రేడింగ్ లో చెన్నై జట్టుకు వచ్చినా పెద్దఫా ఆశ్చర్యం లేదు.   

2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో నటరాజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ లో సన్ రైజర్స్ తరపున ఆడిన నట్టూ.. ఈ సారి క్యాపిటల్స్ కు వెళ్లడంతో ఆ ఆజట్టు బౌలింగ్ దుర్బేధ్యంగా మారింది అనుకున్నారు. కానీ కట్ చేస్తే అసలు నటరాజన్ ను ఎందుకు కొన్నారో అర్ధం కావడం లేదు. ఐపీఎల్ 2025లో నటరాజన్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. రూ.10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ దక్కించుకున్న సీజన్ మొత్తంలో రెండే మ్యాచ్ లు ఆడాడు. యార్కర్ల వీరుడుగా పేరున్న ఈ తమిళ నాడు పేసర్ ను బెంచ్ మీద కూర్చోబెట్టడం విమర్శలకు గురి చేసింది. ఢిల్లీ 2025 సీజన్ లో తొలి తొమ్మిది మ్యాచ్ ల్లో నటరాజన్ కు ఒక్క మ్యాచ్ లో ఆడే ఛాన్స్ ఇవ్వలేదు.

ALSO READ : బుమ్రా దారెటు.. టెస్ట్ సీరీస్ తర్వాత రిలీజ్ చేసిన టీమిండియా.. తర్వాతి అసైన్మెంట్పై డైలమా !

మిచెల్ స్టార్క్, చమీర లాంటి ఫారెన్ ఫాస్ట్ బౌలర్లతో పాటు.. టీమిండియా పేసర్ ముకేశ్ చౌదరీ జట్టులో ఉన్నారు. అయితే ఢిల్లీ తమ ప్రారంభ మ్యాచ్ ల్లో నటరాజన్ కు కాకూండా మోహిత్ శర్మకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వచ్చింది. అతను పెద్దగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత మోహిత్ స్థానంలో నటరాజన్ కు ఛాన్స్ ఇవ్వకుండా చమీరను తుది జట్టులో తీసుకొచ్చారు. 2017లో పంజాబ్ కింగ్స్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన నటరాజన్ ఆ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. 2018, 2019 ఎడిషన్‌కు దూరమైన ఈ  తమిళనాడు పేసర్ ఆ తర్వాత ఐదు సీజన్ ల పాటు సన్ రైజర్స్ జట్టులో ఉన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.