
టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓవల్ టెస్ట్ కు వచ్చాడు. అయితే మ్యాచ్ ఆడడానికి అనుకుంటే పొరపాటే. ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ చూడడానికి హిట్ మ్యాన్ హాజరయ్యాడు. భారత వన్డే కెప్టెన్ రోహిత్ శనివారం (ఆగస్టు 2) ఉదయం లండన్‌లోని ది ఓవల్‌లో కనిపించి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు. మూడో రోజు ఆటకు వచ్చిన రోహిత్.. చాలా సింపుల్ డ్రెస్ వేసుకొని.. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని రిలాక్స్‌గా మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. గ్రౌండ్ లో ఉన్న ప్రేక్షకులు హిట్ మ్యాన్ కు చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు.
చివరిసారిగా టీమిండియా ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ కోసం పర్యటించినప్పుడు ఇదే గ్రౌండ్ లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, సిక్సర్ తో 127 పరుగులు చేసి తన టెస్ట్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ లో భాగంగా ఇది నాలుగో టెస్ట్. ఈ మ్యాచ్ లో టీమిండియా 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మకు దక్కింది. తనకు అద్భుత తీపి జ్ఞాపకాలు ఉన్న రోహిత్ శర్మ మ్యాచ్ చూస్తూ కనిపించడం సోషల్ మీడియాలో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.
టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు లంచ్ సమయానికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. గ్రీజ్ లో ఓపెనర్ జైశ్వాల్ (85), కెప్టెన్ గిల్ (11) ఉన్నారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో ఇండియా ఆధిక్యం 166 పరుగులకు చేరింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్, టంగ్, ఓవర్దన్ లకు తలో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులకు ఆలౌట్ అయితే.. ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది.
THE HITMAN IS HERE AT OVAL..!!!! 🐐
— Tanuj (@ImTanujSingh) August 2, 2025
- Rohit Sharma at The Oval to watch India Vs England Test Match. (ANI).
pic.twitter.com/wzU2oFiv7Y