
హైదరాబాద్ నగర వాసులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పుష్పక్ బస్సు చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు.. అలాగే ఎయిర్ పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల చార్జీలను తగ్గిస్తున్నట్లు శుక్రవారం (ఆగస్టు 01) ప్రకటించింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టు రూట్ లో వెళ్లేవారికి.. అదే విధంగా అక్కడి నుంచి సిటీ రూట్ లో వెళ్లే పుష్పక్ బస్సుల్లో చార్జీలను 50 రూపాయల నుంచి వంద రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఏఏ రూట్లలో ఎంత తగ్గనున్నాయో పేర్కొంది. ఏ స్టాప్ కు ఎంత తగ్గుతుందో ప్రకటనలో పేర్కొంది ఆర్టీసీ.
రూట్ పాత ధర కొత్త ధర
ఎయిర్ పోర్ట్ - శంషాబాద్ 200 100
ఎయిర్ పోర్ట్ - ఆరామర్ 250 200
ఎయిర్ పోర్ట్ - మెహదీపట్నం 350 300
ఎయిర్ పోర్ట్ - పహాడీషరీఫ్ 200 100
ఎయిర్ పోర్ట్ - బాలాపూర్ 250 200
ఎయిర్ పోర్ట్ - ఎల్ బి నగర్ 350 300
అలాగే రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 06:00 గంటల వరకు ఇప్పుడున్న ధరలలో 50 రూపాయలు- తగ్గించారు.
ఎయిర్ పోర్ట్- జూబ్లీ బస్ స్టేషన్ 450 400
ఎయిర్ పోర్ట్ - జెఎన్టీయు/మియాపూర్ 450 400
ఎయిర్ పోర్ట్- - లింగంపల్లి 450 400