కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం:మంత్రి వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం:మంత్రి వివేక్ వెంకటస్వామి

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఐదురోజుల కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో రోజు సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చేరుకున్న సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చింది.. గ్రామగ్రామానికి వెళ్లి కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు వివేక్ వెంటకస్వామి. 

బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూం రాలేదు.. హామీలనునెరవేర్చడంతో బీఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తున్నామన్నారు మంత్రి వివేక్. పేదవాడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. 

►ALSO READ | తెలంగాణలో ఆపరేషన్‌ ముస్కాన్‌.. 7,678 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి తీరుస్తుందన్నారు మంత్రి వివేక్. ఇప్పటికే 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. రాబోయే రోజుల్లో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం.. రైతులందరికీ రైతు భరోసా అందించామన్నారు.  

పదేళ్ల పాలనలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్లు మంజూరు చేసింది. 13వేల కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు అందరూ కృష్టి చేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.