
భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ( ఆగస్టు 1, 2025 ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2023లో విడుదలైన వందలాది చిత్రాల నుంచి అందిన నామినేషన్లను జ్యూరీ పరిశీలించి విజేతలను ఎంపిక చేసింది. ఈ విజేతలకు సంబంధించిన వివరాలను న్యూఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా 'భగవంత్ కేసరి' చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు లభించింది. ఈ సినిమాకు అదనంగా, 'హను-మాన్' చిత్రానికి ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ ( స్టంట్ కొరియోగ్రఫీ) విభాగంలో పురస్కారం దక్కింది.
అలాగే ఉత్తమ గేయ రచయితగా ' బలగం'లో ఊరు పల్లెటూరు పాటకు గానూ కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ కు అవార్డు దక్కింది. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు ఉత్పల్ దత్త ( అస్సామీ ) కు ప్రకటించారు. ఉత్తమ నటుడుగా షారూఖ్ ఖాన్ ( జవాన్ ) , విక్రాంత్ మాస్సే - ( 12th ఫెయిల్ ) , ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ( మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రం ) , ఉత్తమ సహాయ నటుడుగా విజయరాఘవన్ - ( పోక్కాలమ్ మలయాళ చిత్రం ) , జంకీ బోడివాల ( వశ్ గుజరాతీ చిత్రం )లను ఎంపిక చేశారు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరిలో సుకృతి వేణి బండ్రెడ్డి ( గాంధీ తాత చెట్టు ) , కబీర్ ఖాండరి ( జిప్సీ మరాఠి మూవీ) , త్రిష తోసార్, శ్రీనివాస్ పోకలే ( భార్గవ్ జగ్తాప్ - నాల్ 2 మరాఠీ మూవీ ) అవార్డులను సొంతం చేసుకున్నారు.
విజేతల జాబితాలో ముఖ్యమైన సినిమాలు
జాతీయ ఉత్తమ చిత్రం: ‘12th ఫెయిల్’
ఉత్తమ హిందీ చిత్రం: 'కతల్'
ఉత్తమ తెలుగు చిత్రం : భగవంత్ కేసరి, అనిల్ రావిపూడి
ఉత్తమ గుజరాతీ చిత్రం: 'వష్'
ఉత్తమ తమిళ చిత్రం - పార్కింగ్
ఉత్తమ పంజాబీ చిత్రం - గొడ్డే గొడ్డే చా
ఉత్తమ ఒడియా చిత్రం- పుష్కర
ఉత్తమ మరాఠి చిత్రం - శ్యాంచీ ఆయ్
ఉత్తమ మలయాళ చిత్రం - ఉల్లొళు
ఉత్తమ కన్నడ చిత్రం - కందిలు
ఉత్తమ హిందీ చిత్రం: కాథల్
ఉత్తమ గుజరాతీ చిత్రం: వశ్
ఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్
ఉత్తమ అస్సామీస్ చిత్రం: రొంగటపు 1982
ఉత్తమ డైలాగ్ రైటర్: దీపక్ కింగ్రాని ('సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' )
ఉత్తమ సినిమాటోగ్రఫీ: 'ది కేరళ స్టోరీ'
ఉత్తమ కొరియోగ్రఫీ: వైభవీ మర్చంట్ ('రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' చిత్రంలోని 'ధిండోరా బాజే' పాటకు)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్
ప్రేమిస్తున్నా.. (పీవీఎన్ ఎస్ రోహిత్) - బేబీ మూవీ
బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్
చెలియా.. (శిల్పరావు సింగర్) - జవాన్
బెస్ట్ స్క్రీన్‌ప్లే-
బేబీ: సాయిరాజేశ్ నీలం
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత - పార్కింగ్: రాంకుమార్ బాలకృష్ణన్
డైలాగ్ రచయిత
దీపక్ కింగక్రాని: సిర్ఫ్ ఏక్ బండా కాఫి హై
స్పెషల్ మెన్షన్
యానిమల్ (రీరికార్డింగ్ మిక్సర్) - ఎమ్‌ఆర్ రాజకృష్ణన్
బెస్ట్ స్క్రిప్ట్- సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ) - కథారచయిత- చిదానంద నాయక్
బెస్ట్ వాయిస్ ఓవర్- ద సేక్రడ్ జాక్: ఎక్స్‌ప్లోరింగ్ ద ట్రీ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్) - (వాయిస్ ఓవర్: హరికృష్ణన్ ఎస్)
నాన్ ఫీచర్ ఫిలిం విజేతల జాబితా
బెస్ట్ డైరెక్షన్-పీయూశ్ ఠాకూర్ (ద ఫస్ట్ ఫిలిం)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్- ప్రణీల్ దేశాయ్ (ద ఫస్ట్ ఫిలిం -హిందీ)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్- శిల్పిక బోర్డొలాయ్ (మావ్: ద స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరియూ- మిజోరాం చిత్రం)
బెస్ట్ ఎడిటింగ్- నీలాద్రి రాయ్ (మూవింగ్ ఫోకస్)
బెస్ట్ సౌండ్ డిజైన్- శుభరుణ్ సేన్‌గుప్తా (దుండగిరి కె పూల్)
బెస్ట్ ఫిలిం క్రిటిక్: ఉత్పల్ దత్తా (అస్సామీస్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ- లిటిల్ వింగ్స్ (తమిళ చిత్రం) - శరవణముత్తు సౌందరపండి, మీనాక్షి సోమన్
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం (సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వాల్యూస్)
ద సైలెంట్ ఎపిడమిక్ (హిందీ)
బెస్ట్ డాక్యుమెంటరీ- గాడ్ వల్చర్ అండ్ హ్యుమన్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు)
ఉత్తమ షార్ట్ ఫిలిం- గిద్ ద స్కావెంజర్
బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిలిం- టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)
బెస్ట్ బయోగ్రఫికల్/హిస్టారికల్ రికన్‌స్ట్రక్షన్ ఫిలిం
మా బో, మా గాన్ (ఒడియా చిత్రం), లెంటినా ఓ: ఎ లైట్ ఆన్ ద ఈస్టర్న్ హారిజన్ (ఇంగ్లీష్ చిత్రం)
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం- ఫ్లవరింగ్ మ్యాన్ (హిందీ)