
రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా నార్సింగిలో 25 మేకలు మృత్యువాత పడ్డాయి. నార్సింగ్ కి చెందిన యాదయ్య యాదవ్ దగ్గర కొన్ని మేకలు ఉన్నాయి.. ఎప్పటిలానే జులై 24న మేకలను దొడ్డిలోకి పంపించాడు. తిరిగి వచ్చే సరికి వర్షానికి తడిసిన మేకలు మృతిచెందాయి. దీంతో యాదయ్య కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కోరాడు.
ALSO READ :వరదలో వరంగల్.. సిటీలో 30 కాలనీలు జలదిగ్బంధం
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలను అలర్ట్ చేసింది.