డేంజర్ బెల్స్: జస్ట్ వన్ మంత్.. హైదరాబాద్ రోడ్లపైకి 25వేల కొత్త వెహికిల్స్

డేంజర్ బెల్స్: జస్ట్ వన్ మంత్.. హైదరాబాద్ రోడ్లపైకి 25వేల కొత్త వెహికిల్స్

ఇండియన్ మెట్రో నగరాల్లో వాయి కాలుష్యం భయపెడుతోంది. క్షీణిస్తున్న AQI లెవెల్స్ ఆందోళన కలిగిస్తున్నారు. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగు తున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. ఇందుకు కారణం నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య. తాజాగా హైదరాబాద్ నగరంలో ఒక్క నెల రోజుల్లోనే సుమారు 25వేల వెహికిల్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో హైదరాబాద్ తోపాటు నగర శివారు ప్రాంతాలో కాలుష్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 

హైదరాబాద్ నగరంలో రోజుకు వెహికిలర్ పొల్యూషన్ లోడ్ దాదాపు 15వేల టన్నులు ఉంటుందని అధికారిక లెక్కలు చెపుతున్నాయి. ఇందులో అత్యధికంగా టూవీలర్ వెహికిల్స్ తో పొల్యూషన్ వెలువడుతుందని తెలుస్తోంది. 

హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 170 ఉంది. ఢిల్లీ, ముంబై తో నగరాల్లో వరసగా AQI 300 ,500 నమోదు అవుతోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే హైదరబాద్ నగరంలో 77 లక్షల వాహనాలుఉన్నాయి.. నెలకు 25 వేల చొప్పున వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి.. భవిష్యత్ ఇది నియంత్రించకపోతే ప్రమాదంలో  పడే అవకాశం ఉందంటున్నారు. 

దీంతోపాటు 15 సంవత్సరాల కాలం చెల్లిన బస్సులు సిటీలు నడుస్తున్నాయి. 2024 నాటికి మరో 600 పెరిగే అవకాశం ఉంది. ప్రధాన నగరాల్లో దాదాపు 40 నుంచి 70 శాతం వరకు వెహికిల్స్ ద్వారానే ఎయిర్ పొల్యూషన్  సంభవిస్తుందని అంటున్నారు. 

 అయితే నగరంలో ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు పలు  సూచనలు చేస్తున్నారు నిపుణులు. నగరంలో నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు, సరియైన ట్రాఫిక్ మేనేజ్ మెంట్, కాలం చెల్లిన వాహనాల నిషేధం, సైక్లింగ్ ట్రాక్,  ప్రజారవాణా బలోపేతం వంటి చర్యలు ద్వారా పొల్యూషన్ కంట్రోల్ లో ఉంచొచ్చని చెబుతున్నారు.