పోలీసుల అదుపులో 25 మంది నైజీరియన్లు

పోలీసుల అదుపులో 25 మంది నైజీరియన్లు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో వీసా గడువు ముగిసిన 25 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో నిర్భంద తనిఖీలు చేపట్టారు. విదేశీయులే లక్ష్యంగా బండ్లగూడ  జాగీర్, సన్ సిటీ, రాధ నగర్ కాలనీలలోని సుమారు 40 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఉంటున్న వారితో పాటు గడువు ముగిసిన మిర్చీ పౌడర్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేని మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు చెందిన వ్యక్తులకు ఇంటిని అద్దెకు ఇచ్చే సమయంలో ఓనర్లు కచ్చితంగా సీ ఫామ్ పరిశీలించాలని రాజేంద్రనగర్ ACP గంగాధర్ సూచించారు.