కేంద్రం వీటిని నిషేధించింది.. 25 యాప్స్‌‌ బ్యాన్

కేంద్రం వీటిని నిషేధించింది.. 25 యాప్స్‌‌ బ్యాన్

న్యూఢిల్లీ: ఉల్లు, ఆల్ట్‌‌, మూడ్‌‌ఎక్స్‌‌, దేశీఫ్లిక్స్‌‌ సహా 25 ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్‌‌, యాప్స్‌‌, వెబ్‌‌సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్‌‌ చేసింది. అభ్యంతరకర, పోర్న్‌‌ కంటెంట్‌‌ను ప్రసారం చేస్తున్నందుకే వీటిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. వీటన్నింటినీ అందుబాటులో లేకుండా చేయాలని ఇంటర్నెట్‌‌ సర్వీస్‌‌ ప్రొవైడర్లను శుక్రవారం ఆదేశించింది. ఈ ప్లాట్‌‌ఫామ్‌‌లు దేశ ఐటీ రూల్స్‌‌ను ఉల్లంఘించాయని, అశ్లీలత కట్టడికి సంబంధించి అమల్లో ఉన్న చట్టాలను కూడా అతిక్రమించాయని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, టీనేజర్లు వీటికి అడిక్ట్‌‌ అవుతున్నారని ఫిర్యాదులు అందడంతోనే తాజా నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.