హోంగార్డు కుటుంబానికి రూ. 2.50లక్షల ఆర్థికసాయం

హోంగార్డు కుటుంబానికి రూ. 2.50లక్షల ఆర్థికసాయం

సికింద్రాబాద్,వెలుగు:  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డు కృష్ణ యాదవ్​కుటుంబానికి ట్రాఫిక్​ పోలీసులు ఆర్థికసాయం అందించారు. కృష్ణ యాదవ్​ ఐదేండ్లుగా బేగంపేట ట్రాఫిక్​ పీఎస్ లో డ్యూటీ చేస్తున్నాడు. గతేడాది డిసెంబరు 23న జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో అతడు మృతి చెందడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. 

కృష్ణయాదవ్​కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి తెలియడంతో నార్త్​జోన్ ​ట్రాఫిక్ పోలీసులు రూ.2.50 లక్షల విరాళాలు సేకరించారు. మంగళవారం హోంగార్డు​ కృష్ణ యాదవ్​ కుటుంబానికి  నార్త్​జోన్​ ట్రాఫిక్​ డీసీపీ సుబ్బరాయుడు అందజేశారు.