ఈ నెల 20 నుంచి స్టూడెంట్లకు రాగిజావ..ఎడ్యుకేషన్​ మినిస్టర్ సబితా

ఈ నెల 20 నుంచి స్టూడెంట్లకు రాగిజావ..ఎడ్యుకేషన్​ మినిస్టర్ సబితా

హైదరాబాద్, వెలుగు: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం నుంచి సర్కారు బడుల్లో స్టూడెంట్స్​కు రాగిజావను అందించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రోజూ ప్రార్థనా సమయానికి ముందు 250 మిల్లీ లీటర్ల జావను అందిస్తామని వెల్లడించారు. 28,606 బడుల్లోని 25,26,907 మంది స్టూడెంట్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గురువారం ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణతో కలిసి విద్యాశాఖ పనితీరును సమీక్షించారు. 

ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ 20న రాష్ట్రవ్యాప్తంగా ‘మనఊరు–మనబడి’, ‘మన బస్తీ– మనబడి’ కింద వసతులు కల్పించిన వెయ్యి సర్కారు స్కూళ్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని 1,600 బడుల్లో నిర్మించిన 4,800 డిజిటల్ క్లాస్ రూములను విద్యాదినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.