
ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం ( మే 10) సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ లో భాగంగా కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు.
కాల్పుల విరమణ ఇవాళ సాయంత్రం నుంచి అమలులోకి వచ్చిందని.. ఎల్లుండి (సోమవారం, మే 12) తదుపరి చర్చలు జరుగాయని మిస్రీ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మిలిటరీ జనరల్స్ మిగతా అంశాలపై చర్చిస్తారని అన్నారు. పాకిస్తాన్ నుంచి ఇండియాకు కాల్ వచ్చిన తర్వాతనే కాల్పుల విరమణ కు ఒప్పుకున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఫర్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత DGMO కు మధ్యాహ్నం 3.35 గంటలకు ఫోన్ చేసి మాట్లాడారని.. ఇద్దరు మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇండియా-పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని భారత్ అధికారికంగా ప్రకటించడానికి ముందు యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్వీట్ చేశారు. తాము మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు కృషి చేశామని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత ఇండియా అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
ఇండియా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాని గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఉగ్రవాదంపై భారత వైఖరి ఎప్పటిలాగే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన కోసం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను కొనసాగిస్తామని చెప్పారు.
కాల్పుల విరమణపై పాకిస్తాన్ నుంచి కూడా స్పష్టమైన ప్రకటన వచ్చింది. భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.
►ALSO READ | కాల్పుల విరమణకు ఇండియా, పాకిస్తాన్ ఓకే చెప్పాయి : ట్రంప్ సంచలన ప్రకటన
అసలేం జరిగింది:
పహల్గాం దాడి తర్వాత మొదలైన భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మొత్తానికి కొలిక్కి వచ్చాయి. జమ్మూ కశ్మీర్ బైసరన్ వ్యాలీలోని పెహల్గాంలో టూరిస్టులపై పాక్ ఉగ్రవాదాలు జరిపిన కాల్పుల్లో 25 భారత టూరిస్టులతో పాటు ఒక నేపాలీ యాత్రికుడు కూడా చనిపోయాడు. ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్.. ఆపరేషన్ సిందూర్ తో 9 పాక్ ఉగ్ర క్యాంపులను ధ్వంస చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
సై అంటే సై అన్నట్లుగా డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ పరిస్థితులలో భారత్ మాత్రం మానవీయకోణంలోనే ఆలోచించింది. పౌరులకు ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్రవాదులనే లక్ష్యంగా దాడులు చేసింది. కానీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్.. భారత ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోకుండా దాడులకు దిగింది. దీంతో పాక్ సంధించే మిస్సైళ్లు, డ్రోన్లను ధ్వంస చేస్తూనే.. పాక్ కీలకమైన ఆర్మీ, టెర్రర్ బేసిన్ లను ధ్వంసం చేసింది. ఇరు దేశాల దాడులలో బార్డర్ లో కొంత ప్రాణ నష్టం జరిగింది.
రెండు దేశాలు అణుబాంబులు కలిగి ఉన్నవి కావటంతో యుద్ధం తీవ్రతరమైతే భారీ నష్టం ఉంటుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి. కానీ ఎట్టకేలకు కాల్పుల విరమణకు అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది. శుక్రవారం (మే 10) సాయంత్రం 5 గంటల నుంచి కాల్పులను విరమించుకున్నాయి ఇరు దేశాలు.