
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ - 2025 పోటీలు శనివారం (మే 10) హైదరాబాద్ హైటెక్స్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ సుందరీమణులకు చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సోమవారం (మే 12) నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును సంద్శించనున్నారు.
ప్రపంచ సుందరీమణుల రాకకోసం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా దృష్ట్యా బాంబు స్కాడ్, డాగ్ స్కాడ్, ఏరియా డామినేషన్ బృందాల చేత విస్తృత తనిఖీలు నిర్వహించింది జిల్లా పోలీసు యంత్రాంగం. నాగార్జునసాగర్ లో దాదాపు వెయ్యి మంది సిబ్బందితో పటిష్ఠ బందోదుస్తుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
►ALSO READ | కాళేశ్వరంలో పుష్కరశోభ.. మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలు
వివిధ దేశాల నుంచి సుందరీమణులతో పాటు ప్రతినిధులు వస్తున్నందున ఎలాంటి అవాంచనీయా ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బుద్ధవనం సందర్శన ప్రాంతాలలో డ్రోన్ల పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే బుద్ధవనంతో పాటు అతిథులు రెస్ట్ తీసుకోవడానికి విజయ విహార్ గెస్ట్ హౌస్ ను అందంగా తయారు చేసింది పర్యటకశాఖ. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తూ అన్ని అంశాలను మానిటరింగ్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్.