ముంబై లోకల్ రైలులో 26 ఏళ్ల మహిళ మృతి.. ఐదు రోజుల్లో ఇద్దరు

ముంబై లోకల్ రైలులో 26 ఏళ్ల మహిళ మృతి.. ఐదు రోజుల్లో ఇద్దరు

ముంబై లోకల్ రైళ్లలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబైలో ఆఫీసులకు వెళ్ళడానికి లోకల్ రైల్ మీద ఆధారపడిన వారు రోజూ ఒక యుద్ధం చేయాల్సి వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.లోకల్ రైళ్లలో రద్దీ కారణంగా ముంబైలో ఐదు రోజుల్లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రియా రాజ్గోర్ అనే 26ఏళ్ళ మహిళ సోమవారం లోకల్ రైల్లో ప్రయాణిస్తూ ఉదయం 8:30 నుండి 9 గంటల మధ్య రైలు నుండి కిందపడి మరణించింది.

కళ్యాణ్ ప్రాంతంలో తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి నివసిస్తున్న రియా, తానేలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తుంటుంది. ఆఫీస్ కి వెళ్లేందుకు లోకల్ రైల్ ఎక్కిన రియా రైలు రద్దీగా ఉండటంతో ఫుట్ బోర్డు మీద నిలబడి ప్రయాణించింది. మార్గ మధ్యలో బ్యాలెన్స్ కోల్పోయిన రియా కిందపడి మరణించింది. రియా కిందపడటం గమనించిన తోటి ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించగా హాస్పిటల్ కి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. గురువారం జరిగిన మరొక ఘటనలో అవదేశ్ దూబే అనే ఒక ఐఐటీ పీజీ స్టూడెంట్ లోకల్ రైల్లో ప్రయాణిస్తూ మరణించాడు. రద్దీని దృష్టిలో పెట్టుకొని బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.