హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌ లో ఆన్‌ లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.27 లక్షల మోసం

హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌ లో  ఆన్‌ లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో  రూ.27 లక్షల మోసం

హైదరాబాద్‌ సిటీ, వెలుగు: నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.27 లక్షలు మోసపోయాడు. బాధితుడు కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ట్రేడింగ్‌కు సంబంధించిన పోస్టు చూసి, అందులోని లింక్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు సృష్టించిన వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు. ఆ గ్రూప్‌లో మోసగాళ్లు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపుతూ, ఫేక్‌ ప్రాఫిట్‌ స్క్రీన్‌షాట్లు షేర్‌ చేసి పెట్టుబడి పెట్టించారు. 

ఏడీవీపీఎంఏ అనే నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి మొదట రూ.10 వేల పెట్టుబడి పెట్టించారు. కొంత లాభం వచ్చినట్లు చూపడంతో నమ్మిన బాధితుడు క్రమంగా రూ.27 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. యాప్‌లో లాభాలతో కలిపి రూ.81 లక్షలు ఉన్నట్లు చూపించినప్పటికీ, డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా అనుమతి ఇవ్వలేదు. అదనంగా రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాలని కోరడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.