హనుమకొండ జిల్లాలో దివ్యాంగురాలిపై లైంగికదాడి.. నిందితుడు అరెస్ట్

హనుమకొండ జిల్లాలో దివ్యాంగురాలిపై లైంగికదాడి.. నిందితుడు అరెస్ట్

ఎల్కతుర్తి, వెలుగు : మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.‌ సీఐ పులి రమేశ్ తెలిపిన మేరకు.. ఎల్కతుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలు(25), ఇంటి వద్దనే ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు ఆదివారం పొలం పనులకు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన పి. ప్రభాకర్(48) దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. 

సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు బాధితురాలు  పరిస్థితిని చూసి అడగగా జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు ఎల్కతుర్తి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. సీఐ పులి రమేశ్, ఎస్ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్ సిబ్బందితో వెళ్లి గ్రామంలో దర్యాప్తు చేపట్టారు. పలువురిని ప్రశ్నించి, వివరాలు సేకరించారు. నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు.