- మున్సిపల్ ఆఫీసులు, ఆర్డీవో ఆఫీసుల్లో తుది జాబితాల ప్రదర్శన
- రేపు మరోసారి అభ్యంతరాల స్వీకరణ
- 16 న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాతోపాటు ఫొటో ఎలక్టోరల్ రోల్స్ ప్రచురణ
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లోని ఓటర్ల లెక్క తేలింది. ఓటర్ల జాబితాను సోమవారం ఆయా మున్సిపల్ ఆఫీసులు, ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో ప్రదర్శించారు. మంగళవారం ప్రజలకు ఈ జాబితాలు అందుబాటులో ఉంటాయి. వీటిపై 14న బుధవారం ఏవైనా అభ్యంతరాలుంటే మరోసారి ఫిర్యాదు చేసే అవకాశముంది. 16న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాతోపాటు ఫొటో ఎలక్టోరల్ రోల్స్ తుది జాబితాను ప్రచురించనున్నారు.
వందల్లో అభ్యంతరాల పరిశీలన
బల్దియా ఆఫీసర్లు ఈ నెల 1న ముసాయిదా జాబితాను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ముసాయిదా జాబితాల్లో ఒకరి పేరు రెండు, మూడు చోట్ల రావడం, ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటో ముద్రించడం, ఇతర గ్రామాల ఓట్లు మున్సిపల్ జాబితాలో రావడం, మృతిచెందిన ఓటర్ల పేర్లు మళ్లీ నమోదు కావడంలాంటి అభ్యంతరాలు వందల్లో వచ్చిన విషయం తెలిసిందే.
ఈ అభ్యంతరాలను పరిశీలించి సరిదిద్దిన అధికారులు.. సోమవారం జాబితాను ప్రదర్శించారు. కరీంనగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 66 డివిజన్లలో 249 అభ్యంతరాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి పరిశీలించారు. ఫిర్యాదుదారులకు లేఖ పూర్వకంగా సమాచారం ఇచ్చారు.
మున్సిపాలిటీ మహిళలు పురుషులు ఇతరులు మొత్తం ఓటర్లు
కరీంనగర్ 1,70, 858 1,69,679 43 3,40,580
రామగుండం 91,578 91,441 30 1,83,049
చొప్పదండి 7,173 6,743 0 13,916
హుజూరాబాద్ 15,170 14,357 4 29,531
జమ్మికుంట 17,639 16,815 1 34,455
జగిత్యాల 48,742 46,039 19 94,800
రాయికల్ 6,927 6,157 0 13,084
మెట్‌పల్లి 23,917 22,283 1 46,201
కోరుట్ల 32,901 30,604 2 63,507
ధర్మపురి 7,284 6,701 3 13,988
సిరిసిల్ల 43,011 39,942 6 81,959
వేములవాడ 21,279 19,580 18 40,877
పెద్దపల్లి 22, 635 21,623 589 45,845
సుల్తానాబాద్ 8,592 8,231 1 16,824
మంథని 7,452 6,949 1 14,402
